ETV Bharat / state

'కొవిడ్‌ ఉన్నప్పుడు.. ప్రజాభిప్రాయ సేకరణ ఎలా సాధ్యం' - కడపలో యురేనియం తవ్వకాలపై ప్రజాభిప్రాయసేకరణ వార్తలు

కడపలోని యూసీఐఎల్‌ యురేనియం ప్రాజెక్టు విస్తరణ కోసం.. వచ్చే జనవరిలో ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహిస్తామని చెప్పడం అభ్యంతరకరమని విశ్రాంత ఐఏఎస్‌ అధికారి ఈఏఎస్‌ శర్మ అభిప్రాయపడ్డారు. ఈ విషయంపై ఏపీ కాలుష్య నియంత్రణ మండలి ఛైర్మన్‌ బీఎస్‌ఎస్‌ ప్రసాద్‌కు ఆదివారం లేఖ రాశారు.

'కొవిడ్‌ ఉన్నప్పుడు ప్రజాభిప్రాయ సేకరణ ఎలా సాధ్యం'
'కొవిడ్‌ ఉన్నప్పుడు ప్రజాభిప్రాయ సేకరణ ఎలా సాధ్యం''కొవిడ్‌ ఉన్నప్పుడు ప్రజాభిప్రాయ సేకరణ ఎలా సాధ్యం'
author img

By

Published : Dec 7, 2020, 3:25 PM IST

యూసీఐఎల్​ యురేనియం ప్రాజెక్టు విస్తరణపై ప్రజాభిప్రాయ సేకరణ గురించి.. కాలుష్య నియంత్రణ మండలి ఛైర్మన్​ బీఎస్​ఎస్​ ప్రసాద్​కు ఈఏఎస్ శర్మ లేఖ రాశారు. రాష్ట్రంలో ఇతర ప్రాంతాలతో పాటు కడప జిల్లాలోనూ కొవిడ్‌ తీవ్రత ఉందని, అలాంటప్పుడు ప్రజాభిప్రాయ సేకరణ ప్రమాదమని సూచించారు. ఇప్పటికే పలు జబ్బులున్నవారు, పెద్ద వయసువారు కొవిడ్‌తో మృతి చెందారని, సభ నిర్వహిస్తే ప్రజల ప్రాణాలతో చెలగాటమాడినట్లేనని, స్థానిక ప్రజలు కొవిడ్‌ సూపర్‌ స్పైడర్లుగా మారే అవకాశముందని తెలిపారు.

యురేనియం ప్రాజెక్టు ప్రభావంతో ఇప్పటికే అక్కడి ప్రజలు అనారోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారని ఈఏఎస్ శర్మ తెలిపారు. మరోవైపు యురేనియం వ్యర్థాల్ని సైతం భూమిలో శాస్త్రీయంగా వేయడం లేదని, రక్షణ పొరలు ఏర్పాటు చేయకపోవడంతో అక్కడి భూగర్భజలాలు కలుషితమయ్యాయని వెల్లడించారు. దీనిపై ఇప్పటికే కాలుష్య నియంత్రణ మండలి నోటీసులు జారీచేసిందన్నారు. ప్రతీ 6నెలలకూ ప్రాజెక్టులో జరుగుతున్న వ్యవహారాలపై నివేదికల్ని సొంత వెబ్‌సైట్‌లో ఉంచడంతోపాటు, పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖకు ఇవ్వాల్సి ఉన్నా.. అలా చేయడం లేదని శర్మ ఆరోపించారు. ఇవన్నీ చేయకుండా ప్రాజెక్టు విస్తరణ ఎలా చేస్తారని ప్రశ్నించారు.

ఇదీ చదవండి: ప్రముఖ గాయని సునీత​ నిశ్చితార్థం

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.