విశాఖ జిల్లాకు సంబంధించి రావికమతం, రోలుగుంట మండలాల్లో మట్టి విగ్రహాలను తయారు చేస్తూ వాటికి రంగులు అద్ది ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేస్తుంటారు. ఈ క్రమంలోనే ఉభయ గోదావరి జిల్లాలతోపాటు విశాఖ నగరం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలకు ఇక్కడే భారీ సైజులో విగ్రహాలను తయారు చేసి ఎగుమతి చేసేవారు.
విశాఖ గ్రామీణ జిల్లా కూడా ఇటు చింతపల్లి సీలేరు పాయకరావుపేట ఎలమంచిలి చోడవరం అనకాపల్లి ప్రాంతాలకు ఇక్కడి నుంచి ఎగుమతి చేసేవారు. భారీ సైజులతో కాకుండా కేవలం అడుగు రెండడుగుల సైజులు మించకుండా తయారు చేయాలని సూచించారు.
నిమజ్జనానికి సంబంధించి ఐదు రోజులకు మించకుండా ఉత్సవాలు నిర్వహించాలని ఆదేశించారు. ప్రధానంగా వినాయక విగ్రహాలను ఏర్పాటు చేసిన మండపాల వద్ద భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ నిషేధించాలని తెలిపారు. మండపాల వద్ద ఎలాంటి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించిన భక్తులు గుమిగూడిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. విగ్రహ ప్రతిష్టాపనకు నిమజ్జనానికి ఎట్టి పరిస్థితుల్లోనూ ఊరేగింపులు జరపకూడదని తెలిపారు.
ఇదీ చూడండి