విశాఖ జిల్లా మాడుగుల పంచాయతీలో నిధులు పక్కదారి పట్టించిన వైనంపై ఈటీవీ - ఈటీవీ భారత్ కథనాలకు అధికారులు స్పందించారు. సంబంధిత పంచాయతీ ఈవో (పంచాయతీ కార్యనిర్వహణాధికారి) సత్యన్నారాయణను సస్పెండ్ చేస్తూ.. ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేసినట్లు ఎంపీడీవో పోలినాయుడు వెల్లడించారు. విశాఖ జిల్లా మాడుగుల పంచాయతీలో ఇంటి పన్నులు, సంత వేలం పాట నుంచి వచ్చిన సొమ్ము పంచాయతీ ఖాతాలో జమ కాకుండా దారి మళ్లించారు.ఈ తంతులో దాదాపుగా రూ.33 లక్షలు పక్కదారి పట్టింది. దీనిపై ఈటీవీ - ఈటీవీ భారత్ లో కథనాలు ప్రసారం కావటంతో అధికారులు స్పందించారు.
జిల్లా పంచాయతీ అధికారి, ఇతర ఉన్నత అధికారులు సైతం నిధులు పక్కదారి విషయంపై పలుమార్లు విచారణ చేపట్టారు. విచారణ అనంతరం నిధులు దుర్వినియోగం సంబంధించి మాడుగుల పంచాయతీ ఈవో సత్యనారాయణను బాధ్యుడిగా గుర్తించి సస్పెండ్ చేస్తూ రాష్ట్ర పీఆర్ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారని ఎంపీడీవో పోలినాయుడు తెలిపారు. స్వాహా చేసిన నిధుల్లో చాలా వరకు రికవరీ చేసినట్లు ఎంపీడీవో వెల్లడించారు.
ఇవీ చూడండి...