ETV Bharat / state

వరద నీటితో నిండుకుండల్లా జలాశయాలు - విశాఖ జిల్లాలో జలాశయాల వార్తలు

విశాఖ జిల్లా సీలేరు కాంప్లెక్స్‌లో వారం రోజులుగా కురుస్తున్న వ‌ర్షాల‌కు స్థానిక జ‌లాశ‌యాలు జలకళను సంతరించుకున్నాయి. సీలేరు కాంప్లెక్స్‌లో జ‌లాశ‌యాలు నిన్న‌టి మొన్న‌టి వ‌ర‌కూ ఎండిపోయిన‌ట్లుగా ఉండేవి. వారం రోజులు పాటు ఏక‌ధాటిగా కురిసిన వ‌ర్షాల‌కు అని నిండుకుండల్లా మారాయి. ఒక ప‌క్క జ‌లాశ‌యాల‌కు వస్తున్న నీటిని నిల్వ చేస్తూ.. అధికమైనప్పుడు దిగువకు విడుదల చేస్తున్నారు.

reservoirs in vizag district
వరద నీటితో జలకళ సంతరించుకున్న జలాశయాలు
author img

By

Published : Aug 20, 2020, 2:01 PM IST

విశాఖ జిల్లా సీలేరు కాంప్లెక్స్‌లోని జలాశయాలు జల కళను సంతరించుకున్నాయి. మంగ‌ళ‌వారం నుంచి వ‌ర్షాలు త‌గ్గుముఖం ప‌ట్ట‌డంతో కొంత‌మేర‌కు వ‌ర‌ద ఉద్ధృతి త‌గ్గింది. విశాఖ జిల్లా డొంకరాయి జలాశయానికి వరద ఉద్ధృతి కొనసాగుతుండటంతో 2 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. సీలేరులో విద్యుత్‌ ఉత్పత్తి అనంతరం 6 వేల క్యూసెక్కులతోపాటు బాటు ఇతర వాగుల నుంచి భారీగా నీరు వచ్చి చేరుతున్నందున వ‌ర‌ద ఉద్ధృతి కొన‌సాగుతోంది.

నీటిమట్టాన్ని క్రమబద్ధీకరిస్తూ ఒక గేటు ఎత్తి 2 వేల క్యూసెక్కులు, డొంకరాయి ఏవీపీ డ్యాం ద్వారా 3 వేల క్యూసెక్కులు... మొత్తం 5 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. పవర్‌ కెనాల్‌ ద్వారా 3,500 క్యూసెక్కుల నీటిని పొల్లూరు పవర్‌ హౌస్‌కు పంపుతున్నామన్నారు.

గుంటవాడ జలాశయానికి వరద ఉద్ధృతి తగ్గుముఖం పట్టటంతో గేట్లు దించేసిన‌ట్లు అధికారులు తెలిపారు. గుంటవాడ, డొంకరాయి జలాశయాలు పూర్తిగా నిండినందున బలిమెల నుంచి ఏపీ వాటా నీటి విడుదలను నిలుపివేశారు. ఈ వారం రోజుల వ్య‌వ‌ధిలో సీలేరు కాంప్లెక్స్‌లో జ‌లాశ‌యాల‌కు సుమారు 14 టీఎంసీలు నీరు చేర‌గా, మ‌రో 12 టీఎంసీలు నీటిని దిగువ‌కు విడుదల చేశారు.

ఇవీ చదవండి..

ఒడిశా తీరంలో తీవ్ర అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాలకు వర్షసూచన

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.