అల్పపీడన ప్రభావంతో.. గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు సీలేరులోని డొంకరాయి జలాశయం నీటిమట్టం పూర్తిస్థాయికి చేరుకుంది. వరద కొనసాగుతున్న పరిస్థితుల్లో... అధికారులు జలాశయంలోని 4000 క్యూసెక్కులు, ఏవీపీ డ్యాం నుంచి 4400 క్యూసెక్కులు నీటిని దిగువ ప్రాంతాలకు విడుదల చేశారు. నీటిమట్టాలు తగ్గకపోతే మరన్ని గేట్లు ఎత్తనున్నారు. శబరి పరివాహాక ప్రజలంతా అప్రమత్తంగా వుండాలని అధికారులు సూచించారు. ఒడిశా ఎగువ ప్రాంతంలోనూ ఇదే పరిస్థితి కొనసాగుతోందని ఏపీ జెన్‌కో అధికారులు తెలిపారు.
డొంకరాయి జలాశయం నుంచి భారీగా నీటి విడుదల - vishakapatnam district
విశాఖపట్నం, సీలేరు పరిధిలోని జలాశయాలకు పెద్దఎత్తున వరదనీరు చేరుతోంది. ప్రాజెక్టులు దాదాపుగా నిండాయి. వరద ఉధృతి పెరగిన కారణంగా.. డొంకరాయి జలాశయం గేట్లు ఎత్తి అధికారులు నీటిని విడుదల చేశారు.