సింహాచలం దేవస్థానానికి చెందిన స్థలాల్లో చేపట్టిన అక్రమ నిర్మాణాలను దేవస్థానం భూపరిరక్షణ విభాగం సిబ్బంది తొలగించారు. వేపగుంట దరి దుర్గానగర్లో అక్రమ కట్టడానికి సంబంధించిన పునాది, ఇనుప చువ్వలను తీసేయించారు. గోపాలపట్నం దరి ఇందిరానగర్లో నిర్మించిన రేకుల షెడ్డును తొలగించారు. దేవస్థానం స్థలాల్లో అనుమతి లేకుండా ఎలాంటి నిర్మాణాలు చేపట్టినా కఠిన చర్యలు తప్పవని ఈవో సూర్యకళ హెచ్చరించారు.
ఏపీఐఐసీ భూమిలో ఆక్రమణల తొలగింపు..
నరవ శివారు సత్తివానిపాలెం దరిలోని ఏపీఐఐసీ స్థలంలో వెలసిన ఆక్రమణలను రెవెన్యూ అధి కారులు సోమవారం తొలగించారు. ఓ సర్వే నంబరులో సుమారు 8 ఎకరాల ఏపీఐఐసీ స్థలంలో గతంలో కొందరు వ్యక్తులు ప్రహరీ నిర్మించారు. ఏపీఐఐసీ అధికారులు ఫిర్యాదు మేరకు నాడు రెవెన్యూ అధికారులు ప్రహరీని కొంత మేర తొలగించారు. అయితే అరకొరగా ఆక్రమణలను తొల గించారని ఆరోపణలు రావడంతో తాజాగా తహసీల్దారు రామారావు ఆదేశాల మేరకు వీఆర్వోలు సోమవారం అక్కడికి వెళ్లారు.
జేసీబీతో సుమారు మూడు ఎకరాల్లో ఉన్న ప్రహరీని తొలగించారు. పక్కనే ఉన్న ఖాళీస్థలాన్ని కొందరు ఆక్రమించి నిర్మాణాలు చేపట్టారని ఫిర్యాదు రావడంతో ఆ స్థలంలోని ప్రహరీని తొలగించారు. అనంతరం అవి ఏపీఐఐసీ స్థలాలని హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేశారు.
ఇదీ చదవండి: