ETV Bharat / state

కరోనాకు బ్రేకులు... రిజిస్ట్రేషన్లకు జోరు - vizag latest news

కరోనా ప్రభావం తగ్గటంతో విశాఖ జిల్లాలో రిజిస్ట్రేషన్లు ఊపందుకుంటున్నాయి. అక్టోబర్​తో పోల్చుకుంటే నవంబర్​లో రిజిస్ట్రేషన్‌ శాఖ ఆదాయం పెరిగింది.

registrations
registrations
author img

By

Published : Dec 14, 2020, 10:56 PM IST

విశాఖ జిల్లాలో స్టాంపులు, రిజిస్ట్రేషన్‌ శాఖ ఆదాయం పుంజుకుంటోంది. జిల్లాలోని ఎనిమిది సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అక్టోబర్​లో 5,786 దస్తావేజులు రిజిస్ట్రేషన్ కాగా... 67.88 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది. నవంబర్​లో 5,677 దస్త్రావేజులు రిజిస్ట్రేషన్ జరిగి... 68.43 కోట్లు రూపాయలు వచ్చాయి.

2020- 21 ఆర్థిక సంవత్సరంలో జిల్లాలో 8 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు కలిపి నవంబర్ నెల వరకు ప్రభుత్వం ఇచ్చిన లక్ష్యం 512.85 కోట్లు కాగా 71.26 శాతంతో ఇప్పటి వరకు 365.49 కోట్లు సాధించారు. గతేడాది ఇదే కాలానికి 382.63 కోట్ల ఆదాయం వచ్చింది. గత సంవత్సరం పెద్ద ప్రకృతి విపత్తులు లేవు. ఈ ఏడాది నాలుగు నెలలు కార్యాలయాలు మూతపడినా దాదాపు అదే ఆదాయం రావడం విశేషం. విశాఖపట్నం వరకు చూసుకుంటే రిజిస్ట్రేషన్లపై ప్రస్తుతం కరోనా ప్రభావం పెద్దగా కనిపించడం లేదు. రోజూ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు సందడిగా కనిపిస్తున్నాయి.

ఇదీ చదవండి

జనవరి 1 నుంచి నూతన మోటార్ వాహనాల చట్టం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.