ETV Bharat / state

నర్సీపట్నంలో రెడ్​జోన్.... ఆంక్షలు కఠినం - నర్సీపట్నం వార్తలు

నర్సీపట్నంలో తొలిసారిగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అప్రమత్తమైన యంత్రాంగం కొన్ని వార్డులను రెడ్​జోన్​లుగా ప్రకటించింది. ఆ ప్రాంతంలో ఇంటింటి సర్వే చేపట్టాలని నిర్ణయించింది.

red zone
red zone
author img

By

Published : Apr 8, 2020, 12:13 PM IST

నర్సీపట్నంలో రెడ్​జోన్.... ఆంక్షలు కఠినం

విశాఖ జిల్లా నర్సీపట్నంలో తొలిసారిగా రెండు కరోనా పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి. ఈ నేపథ్యంలో యంత్రాంగం అప్రమత్తమైంది. పట్టణంలో పలువార్డులను రెడ్​జోన్​లుగా ప్రకటించారు. జన, వాహన సంచారం లేకుండా రహదారులను దిగ్బంధం చేశారు. తమిళనాడులోని తిరుచిరాపల్లి నుంచి దిల్లీ వెళ్లి అక్కడనుంచి నర్సీపట్నం వచ్చిన ఇద్దరు మహిళలకు కరోనా సోకినట్టు వైద్య పరీక్షల్లో తేలటంతో వారి నివాసం చుట్టుపక్కల అంతా పోలీసులు రెడ్​జోన్​గా ప్రకటించారు. పోలీసులు ఆ ప్రాంతాన్ని తమ పరిధిలోకి తీసుకున్నారు. పట్టణంలోని 22, 23, 24 వార్డులను పూర్తిగా దిగ్బంధం చేశారు.

రెడ్​జోన్​గా ప్రకటించిన ప్రాంతంలో 1481 గృహాలు ఉండగా 5,829 మంది జీవనం సాగిస్తున్నారు. కరోనా కేసులు వెలుగుచూడటంతో ఇంటింటి సర్వేకు 292 బృందాలను నియమించారు. మరోవైపు ఇక్కడి పరిస్థితిని వైద్య శాఖ అధికారులు టెలీకాన్ఫరెన్స్​ ద్వారా ఆరోగ్యశాఖ కమిషనర్​కు వివరిస్తున్నారు. బాధిత మహిళలు దిల్లీ నుంచి వచ్చిన తరువాత ఎవరెవరిని కలిశారని అధికారులు ఆరా తీస్తున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు విజ్ఞప్తి చేస్తున్నారు.

ఇదీ చదవండి: దేశంలో 5వేలకు చేరువలో కరోనా కేసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.