ETV Bharat / state

తొలిసారి లక్ష్యానికి మించిన 'ఆదాయం' - ఏపీ రిజిస్ట్రేషన్ల శాఖ వార్తలు

రిజిస్ట్రేషన్ల శాఖ ఈ ఆర్థిక సంవత్సరంలో నిర్దేశించిన లక్ష్యానికి మించిన ఆదాయం విశాఖ జిల్లాలో వసూలయ్యాయి. జిల్లాలోని 8 రిజిస్ట్రార్ కార్యాలయాలు కలిపి అక్టోబర్ నెలలో రూ.60.1 కోట్లు సాధించాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించగా... నెలాఖరికి రూ. 67.88కోట్ల ఆదాయం సమకూరింది.

stamps and registrations
stamps and registrations
author img

By

Published : Nov 4, 2020, 4:46 PM IST

రిజిస్ట్రేషన్ల శాఖ ఈ ఆర్థిక సంవత్సరంలో తొలిసారి లక్ష్యానికి మించి ఆదాయం సాధించింది. విశాఖ జిల్లాకు సంబంధించి 8 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు కలిపి అక్టోబర్ నెలలో రూ.60.1 కోట్లు సాధించాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించగా... నెల ఆఖరికి రూ.67.88కోట్ల ఆదాయం సమకూరింది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో ఇదే ఎక్కువ ఆదాయం.

ఏప్రిల్ నెల కరోనా వ్యాప్తి చెందడంతో కొన్ని నెలలు రిజిస్ట్రేషన్ కార్యాలయాలు మూసివేశారు. ఆ తరువాత జూన్ నెలలో తెరిచినా పెద్దగా కార్యకలాపాలు సాగలేదు. అక్కడినుంచి నెమ్మదిగా రిజిస్ట్రేషన్ల ప్రక్రియ పెరుగుతూ వచ్చింది. దీనిలో భాగంగానే సెప్టెంబర్ నెలలో 87 శాతం సాధించారు. అక్టోబర్ నెలకు వచ్చేసరికి 112 శాతం ఆదాయం వచ్చింది. మంచి రోజులతో పాటు కరోనా సడలింపు ఇలా అనేక కారణాల వల్ల రిజిస్ట్రేషన్ల ప్రక్రియ పెరగడంతో ఆదాయం ఊహించిన దానికన్నా ఎక్కువ వచ్చింది. విశాఖలోని సూపర్ బజార్ కార్యాలయం అయితే ఏకంగా 146 శాతం ఆదాయం సాధించింది.

ఆదాయాలు ఇలా ఉన్నాయి...

ఆనందపురం కార్యాలయానికి సంబంధించి 816 డాక్యుమెంట్లకుగాను రూ.7.71 కోట్లు, భీమునిపట్నం కార్యాలయానికి సంబంధించి 627 డాక్యుమెంట్లకుగాను రూ.6.35 కోట్లు, విశాఖ నగరంలోని ద్వారకానగర్ కార్యాలయానికి సంబంధించి 739 డాక్యుమెంట్లకుగాను రూ.8.71 కోట్లు , గాజువాక కార్యాలయానికి సంబంధించి 424 డాక్యుమెంట్లకు గాను రూ.4.2 కోట్లు, గోపాలపట్నం కార్యాలయానికి సంబంధించి 390 డాక్యుమెంట్లకు గాను రూ.31.6 కోట్లు, మధురవాడ కార్యాలయానికి సంబంధించి 726 డాక్యుమెంట్లకుగాను రూ.15.84 కోట్లు, పెందుర్తి కార్యాలయానికి సంబంధించి 880 డాక్యుమెంట్లకు గాను రూ.7.4 కోట్ల ఆదాయం సమకూరింది. సూపర్ బజార్ కార్యాలయానికి గాను 1184 డాక్యుమెంట్ లకు సంబంధించి రూ.14.51 కోట్ల ఆదాయం సమకూరింది.

రిజిస్ట్రేషన్ల ప్రక్రియ పెరుగుతున్నప్పటికీ ఫిర్యాదుల సంఖ్య రోజురోజుకి అధికమవుతుందని వాటిని పరిష్కరించేందుకు ప్రతి మంగళవారం ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరిస్తున్నామని అధికారులు పేర్కొంటున్నారు.

ఇదీ చదవండి

బైడెన్​కు భారీగా పడిన ముస్లింల ఓట్లు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.