తమ ప్రాంతాలకు రహదారిని నిర్మించాలని కోరుతూ.. విశాఖ జిల్లా రావికమతం మండల గిరిజనులు ఆందోళన చేపట్టారు. నర్సీపట్నం సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. రోడ్డు సౌకర్యం లేక.. మైదాన ప్రదేశాల వరకు రోగులను డోలీతో మోసుకొస్తున్నామన్నారు. ఎంతో మంది చిన్న పిల్లలు, బాలింతలు, వృద్ధులు మృత్యువాత పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
చాలా కాలం నుంచి సమస్యను అధికారులను విన్నవించినా.. సరైన స్పందన లేదని నిరసనకారులు తెలిపారు. చలి సింగం, జోగింపేట, కళ్యాణపులోవ, చీమలపాడుకు చెందిన గిరిజనులు.. మాత్రలతోనే ఆందోళన నిర్వహించారు. సబ్ కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రాన్ని సమర్పించారు.
ఇదీ చదవండి: నూతన వ్యవసాయ బిల్లుల రద్దుకై కాంగ్రెస్ దీక్షలు