రాష్ట్రవ్యాప్తంగా ఇవాళ్టి నుంచి 8వ విడత రేషన్ పంపిణీకి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. అయితే తమ డిమాండ్లను పరిష్కరించాలంటూ రేషన్ డీలర్ల మెరుపు సమ్మె చేపట్టారు. ప్రభుత్వం స్పందించే వరకు పంపిణీని నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. దీనివల్ల కార్డుదారులు రేషన్ దుకాణాలకు వచ్చి వెనుదిరుగుతున్నారు.
రేషన్ డీలర్లను కరోనా వారియర్స్‌గా గుర్తించి బీమా సౌకర్యం కల్పించాలని వారి సంఘం అధ్యక్షుడు మండాది వెంకట్రావు డిమాండ్ చేశారు. రేషన్ ఇచ్చే సమయంలో వేలిముద్ర నిబంధన ఎత్తివేయాలని కోరారు.
ఇదీ చదవండి