అంతరించిపోతున్న మత్స్యసంపదలో ఒకటైన గోల్డెన్ మార్షిస్ చేప విశాఖ జిల్లా మన్యంలో పెరుగుతోంది. సాధారణంగా ఈ రకం చేపలు ఉత్తర భారత దేశంలోని గంగా నదీ పరివాహక ప్రాంతాల్లో కనిపిస్తుంటాయి. అయితే ఇవి తొలిసారిగా పాడేరు, అరకులోని జలపాతాల్లో పెరుగుతున్నట్లు ఆంధ్ర విశ్వ విద్యాలయ విద్యార్థి డేవిడ్ గుర్తించాడు. జువాలజీ విభాగానికి చెందిన ఇతను... ఆచార్య బాబు నేతృత్వంలో మూడేళ్లుగా ఈ చేపపై పరిశోధన చేస్తున్నారు. ఈ పరిశోధన కోసం విశాఖ గిరిజన ప్రాంతాలలో ఎక్కువ కాలం గడిపాడు ఈ విద్యార్థి.
అంతరించిపోతున్న చేపలలో గోల్డెన్ మార్షిస్ ఒకటి. ఈ చేపలో అధికంగా ప్రోటీన్లు ఉంటాయి. ఇవి మొత్తం 17 రకాలుగా విస్తరించి ఉంటాయి. సాధారణంగా ఇవి ఉత్తర భారత దేశంలో గంగ పరివాహక ప్రాంతాల్లో లభ్యమవుతుంటాయి. కానీ తొలిసారిగా పాడేరు ,అరకు జలపాతాల ప్రవాహాల్లో ఇవి కనిపించడం విశేషం. ఈ చేపను స్పోర్ట్ ఫిష్‌గా కూడా విదేశాల్లో పిలుస్తారు. వేగంగా సంచరించడం ఈ గోల్డెన్ మార్షిస్ చేప విశేషాలు - డేవిడ్, పరిశోధన విద్యార్థి, ఆంధ్ర విశ్వ విద్యాలయం