రంజాన్ సందర్భంగా విశాఖ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ముస్లింలకు రంజాన్ తోఫా పంపిణీ చేశారు. అర్బన్ జిల్లా తెదేపా అధ్యక్షుడు, దక్షిణ నియోజకవర్గం శాసనసభ్యుడు వాసుపల్లి గణేష్ కుమార్ 150 కుటుంబాలకు రంజాన్ తోఫాని పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర తెదేపా కార్యదర్శి నజీర్, పులి వెంకటరమణ, జాఫరుల్లా, హనీఫ్, రహమతుల్లా పాల్గొన్నారు.
ఇదీ చదవండి: కోర్టు ఆదేశాలిచ్చినా.. కార్యాలయాలకు పార్టీ రంగులు అద్దేశారు.