ETV Bharat / state

2 నెలల తర్వాత.. విశాఖలో రైలు కూత! - train journey news

రెండు నెలల విరామం తర్వాత లాక్​డౌన్​ సడలింపుల్లో భాగంగా దేశవ్యాప్తంగా రైళ్లు నడవనున్నాయి. ఈమేరకు విశాఖ నుంచి 2 రైళ్లను నడిపేందుకు రైల్వే అధికారులు అనుమతి ఇచ్చారు.

రేపటి నుంచి రైళ్లు ప‌ట్టాలెక్క‌బోతున్నాయి

author img

By

Published : May 31, 2020, 11:09 PM IST

రేపటి నుంచి రైళ్లు ప‌ట్టాలెక్క‌బోతున్నాయి

రెండు నెలల లాక్​డౌన్​ తర్వాత విశాఖలో రైలు కూత వినిపించనుంది. విశాఖ నుంచి రైలు నడిపేందుకు అధికారులు అనుమతి ఇచ్చారు. రిజర్వేషన్ చేసుకున్న వారిని మాత్రమే స్టేషన్​లోకి అనుమతించనున్నారు. రైల్వే స్టేషన్​ లోపలికి ప్రవేశించేవారు జ్ఞానాపురం మార్గాన్ని వినియోగించాలని అధికారులు వెల్లడించారు. స్టేషన్ నుంచి బయటకు వెళ్లే ప్రయాణికులు ప్రధాన ప్రవేశ ద్వారం నుంచి వెళ్లేలా చర్యలు చేపట్టారు. ప్రయాణికుల కోసం స్టేషన్​లో ఒక థర్మల్ స్కాన్​ యంత్రాన్ని ఏర్పాటుచేశారు.

నిబంధనలివీ..

  • మాస్క్ ధరించి ఉండాలి.
  • 90 నిముషాలు ముందే స్టేషన్​కు చేరుకోవాలి.
  • ఎలాంటి ఆహారం రైల్వే స్టేషన్​లో అందుబాటులో ఉండదు.
  • ప్రతి ప్రయాణికుడికి థర్మల్ పరీక్ష చేసిన తర్వాతే పంపుతారు.
  • పదేళ్ల లోపు, 60 ఏళ్లు పైబడిన వారు ప్రయాణించేందుకు అనుమతి లేదు.
  • ఆరోగ్య సేతు యాప్ డౌన్​లోడ్​ చేసుకుని ఉండాలి.

ఇదీ చూడండి:

పొగాకుతో మరింత కరోనా ముప్పు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.