ప్రయాణికుల రైళ్లు ఇంకా పూర్తిస్థాయిలో పునరుద్ధరణ చేయకపోవడం వల్ల రిజర్వేషన్ చేసుకున్నవారికి నగదు తిరిగి ఇచ్చే ప్రక్రియను రైల్వే అధికారులు వేగవంతం చేశారు. మే 22వ తేదీ తర్వాత రైల్వే రిజర్వేషన్ కార్యాలయాలు తెరుచుకున్నప్పటి నుంచి.. అధికారులు రిఫండ్ చేస్తున్నారు.
టికెట్ డబ్బులు తిరిగి తీసుకునేందుకు వచ్చే వారితో విశాఖ రైల్వే రిజర్వేషన్ కార్యాలయాలు రద్దీగా మారుతున్నాయి. ఆన్లైన్లో రిజర్వేషన్ చేసుకున్న వారికి ఆన్లైన్లోనే నగదు చెల్లిస్తున్నారు. వాల్తేరు డివిజన్ పరిధిలో ఇప్పటివరకు సుమారు రూ. 3 కోట్ల రూపాయలు తిరిగి చెల్లించినట్లు అధికారులు తెలిపారు.
ఇవీ చదవండి: