విశాఖ డివిజనల్ రైల్వే ఆసుపత్రి కొవిడ్ సమయంలో రైల్వే ఉద్యోగులు, పదవీ విరమణ చేసిన వారికి వారి కుటుంబసభ్యులకు చేస్తున్న సేవలను డీఆర్ఎం చేతన్ కుమార్ శ్రీవాస్తవ ప్రశంసించారు. ఇక్కడ ఉన్న ఐసీయూ, రేడియాలజీ, అల్ట్రా సోనోగ్రఫీ, ఎకోకార్డియోగ్రఫీ, ఫిజియోథెరపీ యూనిట్, లేబొరేటరీ వంటి విభాగాలు ఉన్నాయన్నారు. కొవిడ్ మహమ్మారి ని ఎదుర్కొనే క్రమంలో భాగంగా ప్రత్యేక వార్డును ఏర్పాటు చేశారు.
ఇందులోకి కావాల్సిన ఎన్ 95 మాస్కులు, గ్లౌసులు, ఇతర సామగ్రి సమకూర్చారు. డివిజన్లోని 14 హెల్త్ యూనిట్లు ఛత్తీస్‌ఘడ్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్‌లోని మిగిలిన ప్రాంతాల నుంచి వచ్చికేసులతో పాటు వారికి వెంటిలేటర్లు, మానిట్లర్లు, పల్స్ ఆక్సిమీటర్లు, నెబ్యులైజర్లు వంటివి సరఫరా చేసింది.
పీపీఈ కిట్లను తగినంతగా అందజేసింది. రెండు వందల మందికిపైగా పాజిటివ్ పేషంట్లకు చికిత్స చేశారు. 150 మంది డిశ్చార్జ్ అయి ఇళ్లకు వెళ్లారని వైద్యులు వెల్లడించారు. 30 మంది రిఫరల్ ఆసుపత్రులకు పంపించి మరింత మెరుగైన చికిత్స అందించారన్నారు. 900 మంది వరకు ఆర్టీపీసీఆర్ పరీక్షలు నిర్వహించారు.
450 వరకు యాంటిజెన్ టెస్ట్‌లను నిర్వహించారు. 200 మంది వరకు హోం ఐసోలేషన్‌లో ఉండాలని సూచించారు. వారికి కావాల్సిన పల్స్ ఆక్సీమీటర్ వంటివి, మందులను రైల్వే ఆసుపత్రి అందజేసిట్టు వైద్యులు తెలిపారు. ఇక్కడ కొవిడ్ టెస్ట్‌లను నిరంతరాయంగా చేస్తున్నట్టు వివరించారు.
ఇదీ చదవండి: