విశాఖ మన్యం చింతపల్లి పోలీసు స్టేషన్ ఎదుట మహిళ మృతదేహంతో కొత్తపాలెం గిరిజనులు ఆందోళన నిర్వహించారు. మృతురాలి బంధువులు చెప్పిన వివరాల ప్రకారం... కొత్తపాలెం గ్రామానికి చెందిన జోబా చంద్రమ్మ అనే మహిళ... కూలి పనుల కోసం పశ్చిమ గోదావరి జల్లా ఏలూరుకు వెళ్లింది. అక్కడ పనులు చేస్తుండగానే అనారోగ్యానికి గురై మూడు రోజుల క్రితం చనిపోయింది. సంబంధిత యజమాని అంబులెన్సులో మృతదేహం ను ఎక్కించి కేవలం మూడు వేల రూపాయలు దారి ఖర్చులకు ఇచ్చి పంపించారు. గురువారం మహిళ మృతదేహాన్ని ఇంటి వద్ద ఉంచి వెళ్లిపోయారు. దీనిపై గిరిజన సంఘాలు, బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గిరిజన మేధావులు, ప్రజాసంఘాలు స్పందించి... బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా చూడాలని... గిరిజన సంఘాలు డిమాండ్ చేస్తున్నారు.
ఇవీ చూడండి-తెలంగాణలో వ్యాపారి కిడ్నాప్ కలకలం