దిల్లీలో దీక్ష చేస్తున్న రైతుల స్ఫూర్తితో.. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాడుతామని నిర్వాసితులు తెలిపారు. ప్రైవేటు వ్యక్తులకు ఉక్కు కర్మాగారం కట్టబెట్టాలనే నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నామని స్పష్టం చేశారు. దీనికి వ్యతిరేకంగా ఉద్యమించేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నామని తెలిపారు. నిర్వాసితులంతా సమావేశమై.. తమ కష్టాలను వెల్లబోసుకున్నారు.
ఇదీ చదవండి: మంత్రి ఇంటికి పరిమితమై ఉండాలనే ఎస్ఈసీ ఆదేశాలు రద్దు