తెదేపా నేతల అక్రమ అరెస్టులపై విశాఖ జిల్లా మండల కేంద్రం దేవరాపల్లిలో ఆ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు. నాయకులు, కార్యకర్తలు కలిసి దేవరాపల్లి నాలుగు రోడ్ల కూడలిలో అంబేడ్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. వినతిపత్రం సమర్పించారు. అనంతరం అక్రమ అరెస్టులపై ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రభుత్వం తమ పార్టీ నాయకులపై కక్ష సాధింపునకు పాల్పడుతోందని మాజీ ఎమ్మెల్యే రామానాయుడు మండిపడ్డారు. అచ్చెన్నాయుడును ప్రభుత్వం దుర్మార్గంగా అరెస్టు చేసిందన్నారు. జేసీ ప్రభాకర్ రెడ్డిపై వైకాపా కక్ష సాధింపునకు పాల్పడుతుందని ధ్వజమెత్తారు.
ఇవీ చదవండి