విశాఖ స్టీల్ ప్లాంట్, ఇతర ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరించాలన్న నిర్ణయాన్ని కేంద్రం వెనక్కు తీసుకోవాలని సీఐటీయూ నగర అధ్యక్షుడు కుమార్ డిమాండ్ చేశారు. అఖిలపక్ష కార్మిక ప్రజా సంఘాల ఆధ్వర్యంలో జరుగుతున్న 74వ రోజు దీక్షలో ఆయన మాట్లాడారు. ఇప్పటికే ప్రైవేటీకరణ విధానాల వలన అనేకమంది ఉపాధి కోల్పోయి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. కొవిడ్ సమయంలో ప్రభుత్వ రంగ సంస్థలు కీలక పాత్ర పోషిస్తున్నాయన్నారు.
ఆర్టీసీని ప్రభుత్వ రంగంలో విలీనం చేసినప్పటికీ అందులో పనిచేసే కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులందరూ ఉపాధికి దూరమయ్యారని చెప్పారు. వారందరికీ ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. విశాఖలో స్టీల్ ప్లాంట్ లేకపోతే.. రాష్ట్ర రాజధాని ఇక్కడ పెడతామన్న చర్చ కూడా అనవసరమన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడుకునేందుకు ఎంతటి త్యాగానికైనా సిద్ధపడతామని స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: