ETV Bharat / state

కరోనా ఎఫెక్ట్.. కూరగాయలు అమ్ముతున్న ప్రైవేటు ఉపాధ్యాయుడు - విశాఖపట్నం జిల్లాలో ప్రైవేటు ఉపాధ్యాయుని కష్టాలు

కరోనా... అందరి జీవితాలను తలకిందులు చేసింది. కొవిడ్ కారణంగా ఎందరో ఉపాధి కోల్పోయారు. ప్రైవేటు ఉపాధ్యాయులకు కరోనా తీవ్ర ఇబ్బందులను మిగిల్చింది. పాఠశాలలు మూతపడటంతో చాలామంది ఉపాధ్యాయులు కూలీలుగా మారుతున్నారు. వచ్చే అరకొర ఆదాయంతో కుటుంబాన్ని నెట్టుకొస్తున్నారు.

private school teacher becomes as vegetable seller with corona effect in anakapalli vizag district
కూరగాయలు అమ్ముకున్న ప్రైవేటు ఉపాధ్యాయుడు
author img

By

Published : Oct 15, 2020, 8:07 PM IST

విశాఖ జిల్లా అనకాపల్లికి చెందిన చంద్రశేఖర్.. ఓ ప్రైవేటు పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నారు. చక్కగా సాగిపోతున్న వారి జీవితంలో కరోనా అనుకోని కష్టాలు తెచ్చింది. దేశవ్యాప్త లాక్​డౌన్​లో భాగంగా... ప్రైవేటు పాఠశాలలు మూతపడ్డాయి. ఫలితంగా పాఠశాల యాజమాన్యం మార్చి నెల నుంచి జీతాలు ఇవ్వడం లేదు. ఈ క్రమంలో కుటుంబపోషణ భారమైంది. చేసేదేమీ లేక... కూరగాయలు అమ్ముతూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నారు. తనలాగే ఎంతోమంది ప్రైవేటు ఉపాధ్యాయులు ఇబ్బందులు పడుతున్నారని, ప్రభుత్వం దృష్టి సారించి ఆదుకోవాలని కోరారు.

ఇదీచదవండి.

మహిళా రైతులపై అవమానకరంగా పోస్టు... యువకుడికి దేహశుద్ధి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.