విశాఖ మన్యం పాడేరు మండలం వల్లాయి గ్రామానికి చెందిన సూర్యకుమారి నిండు గర్భిణి. ఆమెకు ప్రసవ నొప్పులు రాగా... కుటుంబసభ్యులు మినుములూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి సమాచారం అందించారు. ఆ ఊరికి అంబులెన్స్ వెళ్లే మార్గం లేనందున ఆశా కార్యకర్త మరో నలుగురు వ్యక్తుల సహాయంతో డోలీ కట్టారు. 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆసుపత్రికి ఆమెను తీసుకెళ్లారు. రాళ్లురప్పలూ, బురదలో అవస్థలు పడుకుంటూ గర్భిణిని మోసుకెళ్లారు. ప్రస్తుతం ఆమె మినుములూరులో వైద్య సేవలు పొందుతున్నారు.
ఇవీ చదవండి