ETV Bharat / state

AGENCY PROBLEMS: బాలింతైనా... ప్రాణాలు దక్కాలంటే.. - Tribal pregnancy women problems in G. Madugula

విశాఖ ఏజెన్సీలో కురుస్తున్న జోరువానలకు వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఏ సమస్య వచ్చినా గ్రామం నుంచి బయటకు వెళ్లాలంటే ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. గ్రామాల్లోకి బైక్​ అంబులెన్స్​లు సైతం రాలేని పరిస్థితి. పగటిపూట అయితే ఎలాగోలా తాత్కాలికంగా ఏర్పాటు చేసిన మార్గాల్లో ప్రయాణిస్తుంటారు. కానీ రాత్రి సమయాల్లో అదీ గర్భిణీలకు పురిటి నొప్పులు వస్తే పరిస్థితి ఏంటి? ఇలాంటి పరిస్థితే.. తాజాగా ఓ గర్భిణికి ఎదురైంది. ఆస్పత్రికి చేరుకునేందుకు నానా కష్టాలు పడాల్సి వచ్చింది.

tribals problems
గిరిజన బాలింతను వంతెనపై నడిపించి గ్రామస్థులు
author img

By

Published : Sep 14, 2021, 5:49 PM IST

గిరిజన బాలింతను వంతెనపై నడిపించిన గ్రామస్థులు

విశాఖ జిల్లా మన్యంలో పరిస్థితులు అంతంత మాత్రంగానే ఉంటాయి. పల్లెలకు సరైన రోడ్డు మార్గాలు ఉండని పరిస్థితి. ఎన్నిసార్లు మొర పెట్టుకున్నా పాలకులు పట్టించకునే పాపాన పోరు. అక్కడి ప్రజలు ఎప్పటికీ సమస్యలతో పోరాడుతూనే ఉంటారు. ఇక వర్షాకాలమైతే వారి కష్టాలు వర్ణణాతీతం.

తాజాగా కురుస్తున్న వర్షాలకు ఏజెన్సీ ప్రాంతాల్లో వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. ఇలాంటి సమయంలో జి.మాడుగుల మండలం పెదలోచలి పంచాయతీ చిన్నసంగం గిరిజన ప్రాంతంలో నిండు గర్భిణి కాంతమ్మకు పురిటి నొప్పులు వచ్చాయి. 108 వాహనానికి ఫోన్ చేశారు. కానీ వాగులు ఉద్ధృతంగా ప్రవహిస్తుండటంతో.. గ్రామానికి వచ్చే పరిస్థితి లేదు. ద్విచక్ర వాహనం అంబులెన్స్ కూడా రాలేకపోయింది. దీంతో అతి కష్టం మీద.. ఇంటి వద్దే ప్రసవించింది.

తర్వాత రోజు ఆమెను ఆస్పత్రికి తరలించాల్సి వచ్చింది. కానీ ఎలాంటి రవాణా సౌకర్యాలు లేకపోవడంతో బాలింతను ప్రమాదకరమైన కర్రల వంతెనపై నడిపించారు. తీవ్ర రక్తస్రావంతో కళ్లు తిరుగుతున్నా.. ప్రాణాన్ని కాపాడుకునేందుకు ఆ వంతెనపై నడవక తప్పలేదు. అక్కడనుంచి ద్విచక్ర వాహనం అంబులెన్స్​లో ప్రథమ చికిత్స అందించి.. అనంతరం ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం తల్లీబిడ్డ చికిత్స పొందుతున్నారు.

ఇదీ చదవండీ.. ADDITIONAL LOANS: అదనపు రుణాలు పొందేందుకు రాష్ట్రానికి కేంద్రం అనుమతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.