Pratidwani : శరవేగంగా విస్తరిస్తున్న కొవిడ్ వ్యాప్తిని అరికట్టడం ఎలా? - corona vaccination
దేశంలో ఒక్కసారిగా కరోనా ఉద్ధృతి పెరిగింది. ఒకదాని వెనుక మరొకటిగా వస్తున్న పండుగలు, ఉత్సవాల తర్వాత కొవిడ్ పాజిటివ్ కేసులు రెట్టింపు సంఖ్యలో నమోదవుతున్నాయి. టీకాలు వేసుకున్నామన్న భరోసా, ఇమ్యూనిటీ వచ్చేసిందన్న విశ్వాసం కారణంగా కరోనా నిబంధనలు పాటించడంలో నిర్లక్ష్యం కనిపిస్తోంది. ఈ క్రమంలోనే పండుగలు, కొత్త సంవత్సరం వేడుకల తర్వాత దేశవ్యాప్తంగా కొవిడ్ వైరస్ విజృంభిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో శరవేగంగా విస్తరిస్తున్న కొవిడ్ వ్యాప్తిని అరికట్టడం ఎలా? విపత్కర పరిస్థితులు ఎదురైతే వాటిని ఎదుర్కొనేందుకు ఎలా సిద్ధం కావాలి? ఇదే అంశంపై ఈ రోజు ప్రతిధ్వని.
pratidwani-debate-on-corona-virus-spread-in-country
Last Updated : Jan 6, 2022, 12:06 AM IST