ఇలాంటి పరిస్థితుల్లో ప్రజల వద్దకు వెళ్లి ఓట్లు అడిగేందుకు ఉన్న ఏకైక మార్గం సంతలే. పాడేరు నియోజకవర్గంలో రోజుకో మండలంలో ఏదో రోజు ఎక్కడో ప్రాంతంలో సంత జరుగుతుంది. ఆదివారం ధారకొండ, జర్రెల, రాజేంద్రపాలెం, వంట్లమామిడిలో... సోమవారం అన్నవరం... మంగళవారం జీమాడుగుల... బుధవారం చింతపల్లి... గురువారం జీకేవీధి, మద్దిగరువు, గుత్తులపుట్టు.... శనివారం సప్పరల్లో సంతలకు విపరీతంగా జనం వస్తారు. వీటికి పోలీసుల పటిష్ఠ భద్రత ఉంటుంది. అందుకే వీటినే ప్రచార వేదికలుగా చేసుకుని ప్రధాన పార్టీల నేతలు ఓటర్లను ప్రసన్నం చేసుకుంటున్నారు.
పాడేరులో తెదేపా అభ్యర్థి శ్రావణ్ కుమార్, వైకాపా భాగ్యలక్ష్మి, జనసేన బాల్రాజు, కాంగ్రెస్ సుబ్బారావు సంతల్లో తిరుగుతూ జనంలోకి వెళ్తున్నారు. ఎక్కడ ఎలా ప్రచారం చేసుకున్నా...ప్రధాన నాయకులు క్షేత్రస్థాయికి వెళ్లేటప్పుడు మాత్రం తమకు సమాచారం ఇవ్వాలని పోలీసులు సూచిస్తున్నారు.
ఇదీ చదవండి...