నూతనంగా ఏర్పడిన అనకాపల్లి జిల్లాలో విద్యుత్ కోతలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. బుధవారం మధ్యాహ్నం ఒంటి గంట నుంచి విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. రోజూ మధ్యాహ్నం వేళల్లో విద్యుత్ నిలిపివేస్తున్నారని.. దీని వల్ల ఇబ్బందులు పడుతున్నామని వ్యాపారులు అంటున్నారు. ఒక పక్క వేసవితాపం మరోవైపు విద్యుత్ కోతలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. మరోవైపు విద్యుత్ ఛార్జీల వడ్డనపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ చదవండి: విద్యుత్ ఛార్జీల పెంపు, చెత్త పన్నుల వసూలుపై రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు..