విశాఖ జిల్లా చోడవరంలో విత్తనపు పొట్టేళ్ల ప్రదర్శనను నిర్వహించారు. పశు సంవర్థక శాఖ, రాష్ట్ర గొర్రెల పెంపకందార్ల సమాఖ్య ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ప్రదర్శనలో వివిధ మండలాలకు చెందిన 62 పొట్టేళ్లను తీసుకువచ్చారు. ఈ ప్రదర్శనను స్థానిక ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ ప్రారంభించారు. నెల్లూరు జాతి పొట్టేళ్లను విశాఖ జిల్లాలో ఉత్పత్తి చేయాలని పశుసంవర్థకశాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ ప్రదర్శనలలో పాల్గొన్న పొట్టేళ్లలో నాలుగింటిని ఎంపిక చేసి బహుమతిని అందజేశారు.
ఇవీ చదవండి