విశాఖ మన్యంలో కొన్నిరోజుల క్రితం... ఇన్ఫార్మర్ల నెపంతో ఇద్దరు గిరిజనులను మావోయిస్టులు హతమార్చారనే ఆరోపణలున్నాయి. ఇందుకు మృతుల బంధువులు మావోయిస్టుల తరహాలోనే నిరసన వ్యక్తం చేస్తున్నారు. మావోయిస్టుల చేతిలో బలైన లంబయ్య, రంగారావు బంధువుల పేరుతో గోడపత్రాలు ఏర్పాటు చేశారు. వీరికి విద్యార్థులు మద్ధతిచ్చారు.
ఆ గోడపత్రాల్లో ఇందులో ఏముందంటే.. "మావోయిస్టుల రక్త దాహానికి మరో గిరిజనుడు బలి... మీ మాయ మాటలు విని దళంలో మీతో తిరిగాడు... పోలీసులకు చిక్కి మూడేళ్లు జైలుకెళ్లాడు. జైలు నుంచి ఇంటికి వచ్చి ప్రశాంతంగా కుటుంబసభ్యులతో బతుకుతున్నాడు. మీ పనులు చేయలేదని మా లంబయ్యను చంపి... పోలీస్ ఇన్ఫార్మర్ అంటారా... మావోయిస్టులారా... మీరు ఎంతకి దిగజారిపోయారు."అని లంబయ్య బంధుమిత్రుల పేరుమీద గోడపత్రాలు వెలిశాయి.
రంగారావు బంధుమిత్రులతో దర్శనమిచ్చిన గొడపత్రికల్లో ఇలా ఉంది... " మీ మాయమాటలు నమ్మి మిలిషియా కమాండర్‌గా పనిచేశాడు. అందుకు జైలుకెళ్లాడు. బయటకు వచ్చి ప్రశాంత జీవనం గడుపుతుంటే... మీరు ఇన్ఫార్మర్గా ముద్ర వేస్తారా..." అని ప్రశ్నిస్తూ... పలు గ్రామాల్లో పోస్టర్లు అంటించారు.
ఇవి కూడా చదవండి: