విశాఖ మహా నగరపాలక సంస్థ పాలకవర్గ సమావేశం రసాభాసగా మారింది. ఆస్తి పన్ను పెంపుపై విపక్షాలు చర్చకు పట్టుబట్టాయి. పన్ను పెంపుపై చర్చించాలని తెదేపా, జనసేన, సీపీఎం కార్పొరేటర్లు డిమాండ్ చేశారు. సభ గందరగోళంగా మారడంతో.. కౌన్సిల్ నుంచి మేయర్ హరి వెంకట కుమారి ఛాంబర్‌కు వెళ్లారు. ఛాంబర్‌లో పార్టీ ఫ్లోర్ లీడర్లతో మేయర్ సమావేశమయ్యారు. సభ సజావుగా సాగనివ్వాలని పార్టీ ఫ్లోర్ లీడర్లను మేయర్ కోరారు. భోజన విరామానికి ముందు గంట పాటు సభ్యులు లేవనెత్తిన ప్రధాన అంశాలు పై చర్చ జరుపుతామని మేయర్ హామీ ఇచ్చారు. అనంతరం సమావేశం కొనసాగింది.
ఇదిలా ఉండగా.. సమావేశానకి ముదు.. చెత్తపై పన్ను వ్యతిరేకిస్తూ జనసేన కార్పొరేటర్లు చీపుర్లతో సమావేశానికి హాజరయ్యారు. సీపీఎం నాయకుడు గంగారావు చెత్తబండితో వచ్చారు. చెత్తపై పన్ను వ్యతిరేకిస్తూ విపక్ష నాయకులు నినాదాలు చేశారు. జీవీఎంసీ ద్వారం వద్ద సీపీఎం కార్యకర్తలు, పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది.
'ఈ ప్రభుత్వం అప్రజాస్వామికంగా వ్యవహరిస్తోంది. సముద్ర తీరప్రాంతంలోని మత్స్యకారులను కూడా వదలట్లేదు. పన్ను భారంపై కౌన్సిల్‌లో నిలదీస్తాం' తెదేపా నాయకుడు పీలా శ్రీనివాసరావు
ఇదీ చదవండి: