విశాఖలో నిబంధనలు అతిక్రమిస్తున్న వారిపై ఐపీసీ, డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ ప్రకారం కేసులు నమోదు చేస్తున్నట్లు నగర పోలీస్ కమిషనర్ మనీష్ కుమార్ సిన్హా వెల్లడించారు. ఆదివారం సాయంత్రం 5 గంటల నుంచి సోమవారం సాయంత్రం 5 గంటల వరకు బయట తిరుగుతున్న వారిపై 71 కేసులు నమోదు చేశారు. బహిరంగ స్థలాలు, వివిధ వాణిజ్య ప్రాంతాలు హోటళ్ల వద్ద సంచరిస్తున్న 5,201 వాహనాలకు ఈ- ఛలాన్లు విధించారు. నగరంలో మాస్కు లేకుండా తిరుగుతున్న 43 మందికి జరిమానా విధించామని ఆయన తెలిపారు. కరోనా వైరస్ బారి నుంచి సురక్షితంగా ఉండేందుకు ప్రజలందరూ తప్పనిసరిగా ప్రభుత్వ నిబంధనలు పాటించాలని… నిబంధనలు ఉల్లంఘిస్తే వారిపై తక్షణ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఇదీ చూడండి. ఎంపీ రఘురామకృష్ణరాజు విడుదల వాయిదా