ETV Bharat / state

రూ.2,80,000 రికవరీ చేశాం: డీసీపీ సురేశ్ బాబు

author img

By

Published : Feb 23, 2021, 8:20 PM IST

వైకాపా ఎంపీ విజయసాయి రెడ్డి చేపట్టిన విశాఖ ఉక్కు పరిరక్షణ పాదయాత్రలో జేబు దొంగలు చేతివాటం ప్రదర్శించారని నేర విభాగ డీసీపీ సురేశ్ బాబు చెప్పారు. మొత్తం 8 కేసుల్లో రూ. 3,05,500 దోచుకోగా.. రూ. 2,80,000 రికవరీ చేసుకున్నట్లు తెలిపారు.

theft
రూ.2,80,000 రికవరీ చేశాం: డీసీపీ సురేశ్ బాబు

మూడురోజుల క్రితం విశాఖలో ఎంపీ విజయసాయి రెడ్డి చేపట్టిన స్టీల్ ప్లాంట్ పరిరక్షణ పోరాట పాదయాత్రలో జేబు దొంగలు భారీగా చేతివాటం ప్రదర్శించారు. ఈ పాదయాత్ర కోసం ప్రత్యేకంగా 10 మంది జేబుదొంగలు కృష్ణా జిల్లా నుంచి వచ్చినట్లు విశాఖ నగర నేర విభాగపు డీసీపీ వి.సురేష్ బాబు తెలిపారు. జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ప్రారంభమైన పాదయాత్రలో వీరు నడుస్తూ కొందరిని లక్ష్యంగా చేసుకుని వారి జేబులను కొట్టేశారు. అలా ఆ రోజు సాయంత్రానికి ఎయిర్ పోర్ట్ పోలీస్ స్టేషన్, కంచరపాలెం, ఫోర్త్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో 8 కేసులు నమోదయ్యాయి.

పాత నేరస్థులను విచారించిన పోలీసులకు చోరీలకు పాల్పడిన వారు నగరానికి చెందినవారు కాదని నిర్ధారణకు వచ్చారు. కొందరు ఇచ్చిన సమాచారం మేరకు దర్యాప్తు చేపట్టిన పోలీసులు నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. అందులో ఒకరు విశాఖ చెందిన వ్యక్తి కాగా మరో ముగ్గురు కృష్ణా జిల్లాలకు చెందిన వారిగా గుర్తించారు. మరో ఆరుగురు వరకూ పరారీలో ఉన్నట్లు డీసీపీ తెలిపారు. మొత్తం 8 కేసుల్లో రూ. 3,05,500 దోచుకోగా.. రూ. 2,80,000 రికవరీ చేసినట్లు పోలీసులు వెల్లడించారు.

ఇదీ చదవండి: పాడేరు ఘాట్ రోడ్డులో డీజిల్ ట్యాంకర్ బోల్తా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.