విశాఖపట్నం జిల్లా దేవరాపల్లి మండలం వాకపల్లి శివారు ప్రాంతాల్లో నాటుసారా స్థావరాలపై పోలీసులు దాడులు చేశారు. ఈ దాడుల్లో సుమారు 400 లీటర్ల నాటుసారా తయారీకి ఉపయోగించే పులుపు పట్టుబడింది. పులుపు పారబోసి, ప్లాస్టిక్ డ్రమ్ములను ధ్వంసం చేసినట్లు దేవరాపల్లి ఎస్.ఐ నరసింహమూర్తి చెప్పారు. నాటుసారా తయారు చేస్తున్న నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు.
ఇదీ చదవండి: 'రాష్ట్ర సరిహద్దులో ఒడిశా వాసుల ఆక్రమణ'