విశాఖ జిల్లా చీడికాడ మండలం కొండవీధి సమీపంలో నిర్వహిస్తున్న నాటుసారా తయారీ స్థావరంపై పోలీసులు ముందస్తు సమాచారం మేరకు దాడులు చేశారు. నాటుసారా తయారీకి ఉపయోగించే 500 లీటర్ల బెల్లం ఊటను గుర్తించి ధ్వంసం చేశారు. నాటుసారా తయారీ చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్సై సంతోష్ హెచ్చరించారు. నిందితులపై కేసు నమోదు చేశారు.
ఇదీ చదవండి: 'మధ్యాహ్న భోజన పథకానికి బడ్జెట్ కేటాయింపులు పెంచాలి'