ETV Bharat / state

ఓ బాటసారి.. అందుకో మా సాయం - సీలేరులో లాక్​డౌన్

లాక్​డౌన్ నేపథ్యంలో ఎంతోమంది సొంత గ్రామాలకు వెళ్లాలనుకున్నా వెళ్లలేని పరిస్థితి. కరోనా వల్ల కుటుంబ సభ్యులను కలుసుకుంటామో లేదోననే బాధ. రవాణా వ్యవస్థ స్తంభించినా ఇంటికి వెళ్లాలన్న ఆశతో ఒంట్లో సత్తువ లేకపోయినా ఎన్నో మైళ్ల దూరం సుదీర్ఘ ప్రయాణం చేసిన గమ్యానికి చేరకపోతే ఆ వేదన వర్ణనాతీతం. పొట్టకూటి కోసం పొరుగు రాష్ట్రానికి వలస వెళ్లి సుమారు 220 కిలోమీట‌ర్లు కాలిన‌డ‌కగా వారి గ్రామానికి వెళ్తున్న కూలీలకు పోలీసులు ఆహారం అందించారు.

police distributed food to migrated people in seeleru
సీలేరులో ఒడిశా కూలీలు
author img

By

Published : Apr 4, 2020, 9:38 AM IST

సీలేరులో ఒడిశా కూలీలు

లాక్‌డౌన్ నేప‌థ్యంలో వాహ‌నాలు తిరగక, తిండి దొరకక స్వ‌గ్ర‌ామాల‌కు వెళ్లడానికి కొంతమంది కూలీలు చాలా దూరం నడిచారు. ఒంట్లో శక్తి లేకపోయినా ఒక‌టి కాదు... రెండు కాదు... సుమారు 220 కిలోమీట‌ర్లు నడిచి విశాఖ జిల్లా సీలేరుకు చేరుకున్నారు. ఒడిశా స‌రిహ‌ద్దుల్లోని గ్రామాలలో ఉన్న ప్రజలు స్థానికంగా ప‌నులు లేక‌పోవ‌డం వల్ల భవనాల సెంట్రింగ్​ పని కోసం 16 మంది విశాఖ జిల్లాకు వ‌ల‌స‌ వెళ్లారు. లాక్‌డౌన్ నేప‌థ్యంలో ప‌నులు నిర్వ‌హించ‌డం లేద‌ని... వెళ్లిపోవాలని వారిని బాడుగ‌కు తీసుకువ‌చ్చిన య‌జ‌మానులు సూచించారు. లాక్‌డౌన్ ప్ర‌భావంతో ప‌నులు నిలిచిపోయి...తిన‌డానికి తిండిలేక వారు అక్కడే చిక్క‌ుకుపోయారు. రవాణా వ్యవస్థ స్తంభించండంతో వెళ్లే మార్గం లేక కాలిన‌డ‌క‌న ఒడిశా స‌రిహ‌ద్దుల్లో ఉన్న త‌మ కుటుంబ‌ స‌బ్యుల ద‌గ్గ‌ర‌కు వెళ్లడానికి నిశ్చ‌యించుకున్నారు. విశాఖ నుంచి న‌ర్సీప‌ట్నం, చింత‌ప‌ల్లి మీదుగా త‌మ స్వ‌గ్రామాల‌కు నడస్తూ... సీలేరు వద్దకు చేరుకున్నారు. కూలీల ఆకలి బాధలను చూసిన పోలీసులు, ఆరోగ్య సిబ్బంది వారికి భోజ‌న ఏర్పాట్లు చేశారు. తమకు మూడుచోట్ల పోలీసులు ఆహారాన్ని అందించారని బాధితులు తెలిపారు. కొన్ని వందల కిలోమీటర్లు దాటితే వారు ఒడిశాకు చేరుకుంటారు.

ఇదీచూడండి. నాయీబ్రాహ్మణుల దాతృత్వం... నిరాశ్రయులకు సేవలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.