ETV Bharat / state

మందుబాబులు ఎగబడ్డారు.. పోలీసులు లాఠీ విరిచారు - మందు కోసం బారులు తీరిన జనం తాజా వార్తలు

విశాఖ జిల్లా భీమిలి మండలం అన్నవరం గ్రామం మద్యం దుకాణం వద్ద పోలీసులు లాఠీలకు పని చెప్పారు. మందుబాబులు పెద్ద ఎత్తున గుమిగూడిన కారణంగా.. కఠిన చర్యలతో రద్దీ నియంత్రించారు.

police baton charge at the liquor store
మందుబాబులను నియంత్రించేందుకు పోలీసుల లాఠీఛార్జ్​
author img

By

Published : May 4, 2020, 3:07 PM IST

మద్యం షాపులకు మందుబాబులు పోటెత్తారు. పోలీసులు వారిని కట్టడి చేసేందుకు విశాఖ జిల్లా భీమిలి మండలం అన్నవరం గ్రామంలోని మద్యం దుకాణం వద్ద లాఠీ ఛార్జ్ చేశారు. కంటైన్మెంట్ ప్రాంతాలు మినహా మిగిలిన అన్ని చోట్ల నేటి నుంచి మద్యం అమ్మకాలకు అనుమతులు ఇచ్చారు.

ఉదయం 11 గంటలకు మద్యం షాప్​లు తెరిచినప్పటికీ 9 గంటలకే షాపుల వద్ద బారులు తీరారు. సామాజిక దూరం పాటించాలని నిబంధనలు ఉన్నప్పటికీ ఒకేసారి పెద్ద సంఖ్యలో జనం తరలి రాగా... వారిని నివారించేందుకు పోలీసులు లాఠీలకు పని చెప్పాల్సి వచ్చింది.

ఇవీ చూడండి:

ఎండను పట్టించుకోకుండా.. మద్యం కోసం బారులు తీరారిలా!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.