ఆన్లైన్ ద్వారా జూదం ఆడుతున్న పది మంది యువకులను విశాఖ జిల్లా ఎస్.రాయవరం పోలీసులు అరెస్ట్ చేశారు. బంగారమ్మపాలెం గ్రామానికి చెందిన యువకులు కొన్ని రోజులుగా బృందంగా ఏర్పడి ఆన్లైన్ ద్వారా రమ్మీ ఆడుతున్నారు. నిఘా పెట్టిన పోలీసులు దాడి చేసి వారిని పట్టుకున్నారు. నిందితుల నుంచి సెల్ఫోన్లు, నగదు స్వాధీనం చేసుకున్నారు.
ఇదీ చదవండి: కొత్త రాజధానిలో ఉద్యోగులకు అన్ని రకాల వసతులు: సజ్జల