విశాఖ జిల్లా ఐటీడీఏ కార్యాలయ సిబ్బందికి రక్షిత మంచినీటి సదుపాయం కల్పించడానికి రూ 4.7 లక్షల వ్యయంతో నిర్మించిన మినరల్ వాటర్ ప్లాంట్ను ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి వెంకటేశ్వర్ సలిజామల ప్రారంభించారు. ప్రాజెక్ట్ అధికారి డీకే బాలాజీ ఐటీడీఏ ఉద్యోగులు తాగునీటి సదుపాయ లేక ఇబ్బందులు పడుతున్నారని గుర్తించి ఐటీడీఏ నిధులను రూ 4.7 లక్షలు నిధులు విడుదల చేశారు.
వెలుగు సిబ్బంది నారాయణ రావు ఆధ్వర్యంలో తాగునీటి పథకాన్ని నిర్మించారు. పీఓ వెంకటేశ్వర్ మినరల్ వాటర్ ప్లాంట్ నీటి నాణ్యత పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. తాగునీటి పథకం అందుబాటులోకి రావడంపై ఐటీడీఏ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఐటీడీఏ ఏపీవోవీఎస్ ప్రభాకర్ రావు, పరిపాలనాధికారి కె. నాగేశ్వర రావు, వెలుగు ఏపీడీఎం నాగేశ్వరరావు, ఏ ఏవో సూర్యనారాయణ, డీపీఎం సత్యంనాయుడు, సీతారామయ్య పాల్గొన్నారు.
ఇదీ చదవండి: