విశాఖ జిల్లా డుంబ్రిగుడ మండలం లోగిలిలో 2 కుటుంబాలు విందు జరుపుకున్నాయి. అందరూ భోజనం చేశారు. విందులో పాంగిత్యి అనే వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందాడు. మరో ఏడుగురు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వారిని అరకులోయ ప్రాంతీయ వైద్య కేంద్రానికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం విశాఖ కేజీహెచ్‌కు తరలించామని అరకులోయ సీఐ పైడయ్య తెలిపారు. ఘటనా స్థలంలో ఆహార పదార్థాలను సేకరించి సీజ్ చేశారు. పరీక్షల నిమిత్తం ప్రయోగశాలకు పంపిస్తామన్నారు.
ఇదీ చదవండి :