విశాఖ జిల్లా బుచ్చయ్య పేట మండలం వడ్డాది గ్రామం కొండపై ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి కల్యాణ మహోత్సవం ముగింపు వేడుకలు నిర్వహించారు. ఆదివారం రాత్రి జరిగిన ఈ కార్యక్రమానికి అత్యధిక సంఖ్యలో భక్తులు విచ్చేశారు. సుమారు 30 వేల మంది భక్తులు రావడంతో వడ్డాది గ్రామం జనసందోహాన్ని తలపించింది. ఉత్సవాలకు హాజరైన వారిలో మాస్కులు ధరించిన వారిని వేళ్లపై లెక్కించవచ్చు.
ట్రాఫిక్ జామ్...
గంటల కొద్ది ట్రాఫిక్ జామ్ కావడంతో పోలీసులు చేతులెత్తేశారు. ఫలితంగా ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోయాయి. కరోనా మహమ్మారిని లెక్క చేయకుండా, నియమాలను ఉల్లఘించడం ఆందోళన కలిగించే పరిణామమేనని విశాఖపట్నం వాసులు తెలుసుకోవాలి.