విశాఖ మన్యంలో గత 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. వాటిని దాటి మండల కేంద్రాలకు రావడాని అవస్థలు పడుతున్నారు. అరకులోయ మండలంలోని పెదలబుడు గ్రామానికి వెళ్లే రహదారి పూర్తిగా జలదిగ్భందమైంది.
డుంబ్రిగూడ మండలంలో వాగులకు వంతెనలు లేని కారణంగా.... రాకపోకల కోసం తాడు కట్టుకుని వాగులను దాటుతున్నారు. ఐటీడీఏ అధికారులు, ప్రభుత్వం స్పందించి వాన కాలంలో తమ ఇబ్బందులను తీర్చాలని గిరిజనులు కోరుతున్నారు.
ఇదీ చదవండి: