విశాఖ జిల్లా రాంబిల్లి మండలం రాజకోడూరుకు చెందిన వెంకటరమణ.. 25 ఏళ్లుగా ప్రకృతి వైద్యంతో ప్రజలకు సేవలందిస్తున్నారు. చక్కెరవ్యాధి, రక్తపోటు, శ్వాసకోస, ఉదర, హృదయ, ఎముకలకు సంబంధించిన స్వల్ప, దీర్ఘకాలిక రోగాలకు చికిత్స అందిస్తున్నారు. తన వద్ద ఉండే ప్రకృతి వైద్య మూలికలతో పేదలకు ఉచితంగా, మిగిలిన వారికి నామమాత్రపు ధరలతో వైద్యం అందిస్తున్నారు.
ప్రకృతి వైద్యం కోసం వెంకటరమణ తనకున్న ఏడెకరాల పొలంలో ఔషధ మొక్కలు పెంచుతున్నారు. ఇంతకుముందు తృణధాన్యాలు పండించే వెంకటరమణ.. ఇప్పుడు కేవలం ఔషధ మొక్కలు, ప్రకృతి వైద్యానికి అవసరమైన ఇతర పాదులను పెంచుతున్నారు. వెంకటరమణ ప్రకృతి వైద్యం సత్ఫలితాలు ఇస్తోందని చికిత్స పొందిన రోగులు చెబుతున్నారు. ఉత్తరాంధ్ర జిల్లాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా వెంకటరమణ వద్దకు ప్రకృతి వైద్యం కోసం రోగులు వస్తుంటారు.
ఇవీ చదవండి