కరోనాపై ప్రజల్లో అప్రమత్తత పెరుగుతోంది. ఆంక్షలు విధింపు నేపథ్యంలో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. విశాఖలో నిత్యావసరాల కోసం బయటికి వస్తున్న ప్రజలు సామాజిక దూరాన్ని పాటిస్తున్నారు. క్యూలైన్లలో పద్ధతిగా వెళ్తూ కొనుగోళ్లు చేస్తున్నారు. రైతు బజారును గాంధీ గ్రామం ప్రభుత్వ పాఠశాల మైదానంలో ఏర్పాటు చేశారు. కిరాణా దుకాణాల వద్ద క్యూ పాటిస్తున్నారు. ట్రైనీ డీఎస్పీ రవికిరణ్ ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు.
ఇదీ చదవండి: