ETV Bharat / state

People Facing Problems with CM Tour: "ఆ చెట్లు నరికేయ్​.. ఈ డివైడర్​ తీసేయ్​.. సీఎం సారొస్తున్నారు"

CM Jagan Tour Problems: ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పర్యటనలు ప్రజలకు తిప్పలు తెచ్చి పెడుతున్నాయి. ఆయన వస్తున్నారంటే చాలు ప్రజలు హడలెత్తుతున్నారు. భద్రత పేరు చెప్పి అడ్డు లేకున్నా కూడా వాటిని తీసేస్తున్నారు. చెట్లు నరకడం, దుకాణాలు, హోటళ్లు బంద్​ చేయడం లాంటివి చేస్తున్నారు. తాజాగా నేడు పర్యటించనున్న విశాఖ, రేపు పర్యటించనున్న నెల్లూరులో కూడా కొన్నింటిన నరికేసి.. మరికొన్నింటిని మూసివేస్తున్నారు.

CM Tour Problems
CM Tour Problems
author img

By

Published : May 11, 2023, 1:42 PM IST

CM Jagan Tour Problems: ముఖ్యమంత్రి జగన్‌ పర్యటనలు అంటే చాలు రాష్ట్ర ప్రజలు బెంబెలెత్తుతున్నారు. ఆయన పర్యటనలకు, బహిరంగ సభలకు అడ్డొస్తే.. ఏవైనా సరే అడ్డులేకుండా అధికారులు తొలగిస్తున్నారు. ఈరోజు విశాఖలో సీఎం జగన్​ పర్యటించనున్నారు. ఈ క్రమంలో దుకాణాలు, హోటళ్లు బంద్​ చేయడం.. ట్రాఫిక్‌ ఆంక్షలు పెట్టడం, చెట్లను కొట్టేయడం, చెత్తాచెదారం కనిపించకుండా రోడ్ల పక్కన అడ్డు తెరలు కట్టడం లాంటి పనులు పలు విమర్శలకు తావిస్తోంది.

పచ్చని చెట్లపై సిబ్బంది ప్రతాపం: సీఎం జగన్​ పీఎం పాలెంలోని ఏసీఏ-వీడీసీఏ క్రికెట్‌ స్టేడియం బి-మైదానంలో వైఎస్సార్​ విగ్రహ ఆవిష్కరణలో పాల్గొంటారు. ఎయిర్​పోర్టు నుంచి స్టేడియానికి హెలికాప్టర్‌లో చేరుకునేందుకు బి-గ్రౌండ్‌లో కొత్తగా హెలీప్యాడ్‌ ఏర్పాటు చేశారు. అయితే దీనికి దూరంగా గోడ పక్కన ఉన్న ఆరు భారీ చెట్లను అధికారులు కొట్టేయించారు. అయితే స్టేడియం నుంచి 3 కిలోమీటర్ల దూరంలోనే రుషికొండ వద్ద హెలీప్యాడ్‌ ఉన్నా.. కొత్తగా బి-గ్రౌండ్‌లో క్రికెట్‌ పిచ్‌ పక్కనే హెలీప్యాడ్‌ ఏర్పాటు చేయడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

మలుపు తిరిగే అవకాశమున్నా: సీఎం జగన్​ క్రికెట్‌ స్టేడియం బి-గ్రౌండ్‌ నుంచి ఏ-గ్రౌండ్‌కు వెళ్లేందుకు ప్రాంగణంలోనే ప్రత్యేకంగా రోడ్డు నిర్మించారు. ఏ-గ్రౌండ్​లో కార్యకర్తలతో సమావేశం అనంతరం అక్కడ నుంచి నేరుగా జాతీయ రహదారి పైకి సీఎం కాన్వాయ్‌ వెళ్తుంది. అక్కడి నుంచి 50 మీటర్లు ముందుకెళితే సిగ్నల్‌ వద్ద యూటర్న్​ తీసుకునే అవకాశం ఉన్నప్పటికీ, పోలీసులు అత్యుత్సాహంతో జాతీయ రహదారి డివైడర్లు తొలగించి.. నేరుగా అవతలి రోడ్డులోకి వెళ్లేందుకు ఏర్పాట్లు చేశారు. సుమారు 30 మీటర్ల మేర డివైడర్‌ను తొలగించారు. మళ్లీ దానిని కట్టాలంటే 2 లక్షల రూపాయల వరకు ఖర్చవుతుంది.

ముందురోజే మూత: క్రికెట్‌ స్టేడియం నుంచి ఆరిలోవలోని అపోలో ఆసుపత్రికి, అక్కడి నుంచి ఆర్కే బీచ్‌ వరకు సీఎం రోడ్డు మార్గాన ప్రయాణించనున్నారు. ఈ నేపథ్యంలో సీఎం పర్యటనకు ముందురోజు సాయంత్రం నుంచే ఆయా ప్రాంతాల్లో హోటళ్లు, దుకాణాలను మూసివేయాలని అధికారులు ఆదేశించారు. దీంతో పీఎం పాలెం లా కాలేజ్​ కూడలి, ఎండాడ కూడలి, పెట్రోలు బంకు, జూపార్కు వద్ద జాతీయ రహదారికి సంబంధం లేకుండా సర్వీసు రోడ్లకు దూరంగా ఉన్న హోటళ్లు, దుకాణాలనూ మూయించారు. హనుమంతవాక నుంచి అపోలో ఆసుపత్రి వరకు ఉన్న తోపుడు బండ్ల వ్యాపారులను వెనక్కి పంపించేశారు. బుధవారం నిర్వహిస్తున్న కొన్ని దుకాణాలను సమాచారం ఇవ్వకుండానే జేసీబీ యంత్రాలతో టౌన్‌ ప్లానింగ్‌ అధికారులు తొలగించారు.

అడ్డం రాకపోయిన విద్యుత్​ స్తంభాలు తొలగించాలని ఆదేశం: మరోవైపు రేపు(మే 12) ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి నెల్లూరు జిల్లా కావలిలో పర్యటించనున్నారు. ఇందుకోసం అధికారులు గత ఐదు రోజుల నుంచి ఏర్పాట్లు చేస్తున్నారు. మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి, జిల్లా కలెక్టర్ హరినారాయణన్, ఎస్పీ తిరుమలేశ్వర రెడ్డి, ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో హెలిప్యాడ్ నిర్మాణం చేశారు. బహిరంగ సభ వేదిక నిర్మాణం చేశారు. సీఎం జగన్​ భద్రత దృష్ట్యా ఆ ప్రాంతంలోని దుకాణాలు ముందుగానే మూయించారు. తాజాగా హెలీప్యాడ్​కు తూర్పు భాగానా అంబేడ్కర్​ నగర్లో పేదలు నివాసాలు ఉంటున్నారు. అయితే అక్కడ ఉన్న విద్యుత్ స్తంభాలు తొలగించాలని స్థానికులకు ఉన్నతాధికారులు చెప్పి వెళ్లారు. దీంతో స్థానికుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. గతంలో అదే జగన్మోహన్ రెడ్డి, పవన్ కల్యాణ్​లు కూడా అదే ప్రాంతంలో దిగినప్పుడు రాని విద్యుత్ స్తంభాలు.. నేడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎందుకు వచ్చాయని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. పక్కనే ఉన్న సబ్​స్టేషన్​, అపార్ట్​మెంట్​ అడ్డు రావా అని ప్రశ్నించిన స్థానికులు.. కావాలనే పేదలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇవి చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.