విశాఖ జిల్లాలో రహదారులు, వంతెనల నిర్మాణ పనులు నెమ్మదిగా జరుగుతున్నాయి. చోడవరం, మాడుగుల నియోజకవర్గాల పరిధిలో శారదా నదిపై జరుగుతున్న వంతెనల పనులు ముందుకు సాగటం లేదు. దీంతో గ్రామీణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
గవరవరం వద్ద 2011 - 12 మధ్య వంతెన కూలింది. దీంతో శారదా నదిపై ప్రజల రాకపోకల నిమిత్తం తాత్కాలికంగా కాజ్వే ఏర్పాటు చేశారు. భారీ వర్షాలకు నది ఉద్ధృతంగా ప్రవహించినపుడు కాజ్వే కొట్టుకుపోతోంది. 2017లో వంతెన నిర్మాణానికి శ్రీకారం చుట్టినప్పటికీ అది ఇంకా పూర్తి కాలేదు. పనులు వేగవంతంచేసి రాకపోకలు పునరుద్ధరించాలని చోడవరం, దేవరాపల్లి, కె.కోటపాడు మండలాల ప్రజలు కోరారు. 2021 మార్చి నాటికి వంతెన పనులు పూర్తివుతాయని రహదారులు, భవనాల శాఖ సహాయక ఇంజనీర్ చెప్పారు.
ఇదీ చదవండి:
పోలవరానికి కేంద్రం నిధులివ్వకుంటే బాధ్యత మేమే తీసుకుంటాం: మంత్రి బొత్స