రూడకోట సంతలో మావోయిస్టుల చేతిలో హతమైన గిరిజనులకు గుర్తుగా శాంతి స్థూపం వెలిసింది. ఆంధ్ర, ఒడిశా సరిహద్దులో గల ఈ ప్రాంతంలో మావోయిస్టులకు మంచి పట్టు ఉంది. వారోత్సవాల సందర్భంగా మావోలకు వ్యతిరేకంగా స్థూపం వెలవడం ఇదే తొలిసారి. రూడకోటకు సరిహద్దులో మల్కానాగిరి జిల్లాకు చెందిన పనసపుట్టు, ఆండ్రాపల్లి, జొడంభో తదితర పంచాయతీలు ఉన్నాయి. మావోలకు ప్రాబల్యం ఉన్న ప్రాంతాల్లో స్థూపమే కాకుండా... ఆదివాసీ అభ్యుదయ సంఘం పేరుతో బ్యానర్లు సైతం ప్రత్యక్షమయ్యాయి.
ఇదీ చూడండి... అప్పుల బాధ తాళలేక రైతు ఆత్మహత్య