ప్రధాని మోదీ ప్రకటించిన రూ.20 లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీలో అన్ని వర్గాల వారికి అవకాశం కల్పించాలని పీసీసీ రాష్ట్ర అధ్యక్షుడు సాకే శైలజనాథ్ కోరారు. గతంలో లక్షా 70 వేల కోట్లు ప్రకటించిన ఆర్థిక ప్యాకేజీ సక్రమంగా ఎవరికీ అందలేదని తెలిపారు. ప్రస్తుతం ప్రకటించిన ఈ ప్యాకేజీని ప్రధానమంత్రి ఎక్కడ నుంచి తెస్తారని ప్రశ్నించారు.
కేంద్ర ప్రభుత్వం ప్రతి కుటుంబానికి పది వేల రూపాయలు ఆర్థిక సహాయం అందించాలని డిమాండ్ చేశారు. రైతాంగాన్ని, బడుగు, బలహీన వర్గాలతో పాటు వలస కూలీలను, ఉపాధి కూలీలను దేశ పౌరులుగా గుర్తించి వారికి ప్యాకేజీ ద్వారా న్యాయం చేయాలని కోరారు.
ఇవీ చదవండి: