విశాఖ ఉక్కు కర్మాగారం మీద చేయి వేస్తే భాజపాకు భవిష్యత్ ఉండదని పీసీసీ చీఫ్ శైలజానాధ్ వ్యాఖ్యానించారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను కాంగ్రెస్ తీవ్రంగా వ్యతిరేకిస్తుందన్నారు. విశాఖలోని పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. కేంద్ర బడ్జెట్లో రైల్వే జోన్ ఊసే లేదని, ఉత్తరాంధ్ర ప్యాకేజీకి తావేలేకుండా చేశారని మండిపడ్డారు. భాజపాతో ముఖ్యమంత్రి జగన్ కుమ్మక్కయ్యారని... అందుకే మౌనంగా ఉన్నారని ఆరోపించారు. స్టీల్ ప్లాంట్ కోసం కాంగ్రెస్ ఆధ్వర్యంలో జాతీయస్థాయిలో పోరాటాన్ని ఉద్ధృతం చేస్తామని శైలజానాథ్ స్పష్టం చేశారు.
ఇద చూడండి:
'విశాఖ ఉక్కును ప్రైవేటుపరం చేయాలని చూస్తే మరో ఉద్యమం తప్పదు'