ETV Bharat / state

నెల ముందుగానే పీఎం కిసాన్‌ సొమ్ము - విశాఖలో లాక్​డౌన్

లాక్‌డౌన్‌ అన్ని వర్గాలపైనా తీవ్ర ప్రభావమే చూపుతోంది. ఆయా వర్గాలను ఆదుకోవాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ముందుగానే ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించింది. ఇప్పటికే మహిళల జన్‌ధన్‌ ఖాతాలకు రూ.500ను జమచేసింది. అన్నదాతలకు ప్రధానమంత్రి కిసాన్‌ యోజన (పీఎం కిసాన్‌) పెట్టుబడి సాయంగా మేలో అందించాల్సిన రూ.2 వేల ఆర్థిక సాయాన్ని ఏప్రిల్‌లోనే రైతుల ఖాతాలకు సర్దుబాటు చేస్తున్నారు. కేంద్ర సర్కారు అందించే ఈ సొమ్ములు శనివారం నుంచే రైతుల ఖాతాల్లోకి జమవనున్నాయి. విశాఖ జిల్లాలో సుమారు 2.5 లక్షల మంది రైతులకురూ.50 కోట్లు పీఎం కిసాన్‌ ద్వారా రానున్నాయి.

Payment of PM Kisan cash in advance of the month
పీఎం కిసాన్ నగదు
author img

By

Published : Apr 14, 2020, 6:07 PM IST

గతేడాది నుంచి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు పీఎం కిసాన్‌, వైఎస్సార్‌ రైతు భరోసా పేరిట పెట్టుబడి సాయాన్ని అందిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం రూ.6 వేలు, రాష్ట్ర ప్రభుత్వం రూ.7,500 చొప్పున మూడు విడతల్లో రూ.13,500 ఆర్థిక సాయం అందించి అన్నదాతలకు అండగా నిలుస్తున్నాయి. ఈ ఏడాది ఖరీఫ్‌ పనులకు సంబంధించి మే నెలలో మొదటి విడతగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రూ.7,500 చొప్పున రైతులకు అందచేయాల్సి ఉంది. కేంద్రం తన వంతు ఖరీఫ్‌ సాయాన్ని ముందుగానే రైతులకు అందించడానికి ముందుకొచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా సొమ్ములను వచ్చే నెలాఖరులోగా అందించాలని అవసరమైన సమాచారాన్ని జిల్లాల నుంచి సేకరిస్తోంది.

అన్నదాతల ఖాతాల్లోకి రూ.50 కోట్లు..

జిల్లాలో 3.29 లక్షల సన్న చిన్నకారు రైతు ఖాతాలున్నాయి. అందులో గతేడాది 2.2 లక్షల ఖాతాలకు పీఎం కిసాన్‌ సొమ్ములు పడ్డాయి. కౌలు రైతులు, ఇనాం భూములు, డి పట్టా, ఏజెన్సీలోని ఆర్వోఎఫ్‌ఆర్‌ పట్టాలున్న రైతులకు కేంద్ర సాయం అందడం లేదు. వారికి రాష్ట్ర ప్రభుత్వమే రైతు భరోసా కింద మొత్తం సాయం అందిస్తుంది. గతేడాది కంటే ఈ ఏడాది పీఎం కీసాన్‌ లబ్ధిదారుల సంఖ్య పెరగనుంది. సుమారు 2.5 లక్షల మందికి లబ్ధి చేకూరే అవకాశం ఉందని సంబంధిత అధికారులు చెబుతున్నారు. వారంలోపే వీరి ఖాతాల్లోకి రూ.2 వేలు చొప్పున రూ.50 కోట్లు జమ కానున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం కూడా రైతు భరోసా సాయాన్ని ముందుగానే అందించి ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.

ఇదీచూడండి.సీఎం రిలీఫ్ ఫండ్​కి 'శ్రీకన్య' కళాశాల రూ.10 వేలు విరాళం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.