పాయకరావుపేటలో 2 రోజులపాటు లాక్ డౌన్ పూర్తిగా అమలు చేస్తున్నట్లు పోలీస్, రెవెన్యూ శాఖ అధికారులు తెలిపారు. పక్కనే ఉన్న తునిలో ముగ్గురికి కరోనా సోకినందున ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు.
ఆది, సోమవారాల్లో మాంసం, కూరగాయల అమ్మకాలు చేపట్టరాదని దుకాణదారులను హెచ్చరించారు. పట్టణంలోని కూడళ్లు, ప్రధాన ప్రాంతాల్లో బారికేడ్లు ఏర్పాటు చేసి తనిఖీలు చేస్తున్నారు.
ఇవీ చదవండి:
గుజరాత్ నుంచి విశాఖ చేరుకున్న మత్స్యకారుల్ని కలిసిన కలెక్టర్