ETV Bharat / state

Pawan Kalyan Varahi Yatra in Visakhapatnam: విశాఖలో జనసేన వారాహి యాత్ర.. పోలీసుల ఆంక్షలు - జగదాంబ సెంటర్

Varahi Yatra in Visakhapatnam : జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ వారాహి యాత్రకు విశాఖ ప్రజలు ఎదురుచూస్తున్న తరుణంలో పోలీసుల ఆంక్షలు ఆయన అభిమానుల్లో ఆందోళన రేకెత్తిస్తున్నాయి. నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించిన పోలీసులు.. ఎయిర్ పోర్టుకు చేరుకున్న పవన్​ను ముందస్తు ప్లాన్ ప్రకారం దారి మళ్లించి ఆయన బసచేయనున్న హోటల్​కు చేర్చారు. ఇవాళ సాయంత్రం జగదాంబ సెంటర్​లో జనసేన బహిరంగ సభ జరగనుంది.

Etv Bharat
Etv Bharat
author img

By

Published : Aug 10, 2023, 4:04 PM IST

Pawan Kalyan Varahi Yatra in Visakhapatnam: విశాఖలో జనసేన వారాహి యాత్ర.. పోలీసుల ఆంక్షలు

Pawan Kalyan Varahi Yatra in Visakhapatnam: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నేటి నుంచి విశాఖలో వారాహి యాత్ర నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో నగరంలో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఇవాళ సాయంత్రం జగదాంబ సెంటర్లో బహిరంగ సభకు భారీ ఏర్పాట్లు చేశారు. దీంతో జగదాంబ సెంటర్​కు వెళ్లే దారుల్లో ట్రాఫిక్ మళ్లించారు. జగదాంబ సెంటర్​ మీదుగా వన్ టౌన్ వెళ్లే బస్సులు, ఆటోలు అన్నీ దారి మళ్లించడంతో ఆ రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. ఉదయం నుంచి వాహనాలను దారి మళ్లించడంతో జగదాంబ సెంటర్​ మీదుగా కేజీహెచ్, వన్ టౌన్ వెళ్లే ప్రజలు రవాణా సౌకర్యం లేక తీవ్ర అవస్థలు పడ్డారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్​కు అభిమానుల్లో విపరీతమైన క్రేజ్ ఉందనే విషయం అందరికీ తెలిసిందే. సినీ హీరోగా, ఓ పార్టీ అధినేతగా పవన్ కళ్యాణ్​ను అభిమానులు ఎంతో ఇష్టపడుతుంటారు.

Pawan Varahi Vijaya Yatra: జనంలోకి జనసేనాని.. విశాఖలో ప్రారంభం కానున్న వారాహి యాత్ర మూడవ దశ

Pawan Fans Photos with Varahi: పవన్ కళ్యాణ్ నేటి నుంచి విశాఖలో వారాహి యాత్ర (Varahi Yatra) చేపడుతున్న విషయం తెలుసుకున్న అభిమానులు.. వారాహి వాహనాన్ని చూసేందుకు, వాహనంతో ఫొటోలు దిగేందుకు ఎగబడ్డారు. వారాహి వాహనం ఎవరికీ కనబడకుండా జిల్లా పరిషత్ సమీపంలోని ఓ రోడ్డులో పార్కు చేశారు. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు... వారాహి వాహనంతో ఫోటోలు దిగేందుకు పోటీపడ్డారు. ఉదయం నుంచి పెద్ద సంఖ్యలో అభిమానులు ఇక్కడికి వచ్చి ఫోటోలు దిగడంతో ఈ ప్రాంతం పవన్ అభిమానులతో కిక్కిరిసిపోయింది. మగవారితో పాటు యువతులు, మహిళలు కూడా పెద్ద సంఖ్యలో ఇక్కడ గుమిగూడి వాహనంతో ఫొటోలు దిగారు. వారాహి వాహన భద్రత సిబ్బంది అభిమానులను అక్కడి నుంచి పంపేందుకు అవస్థలు పడ్డాయి. అభిమానులను బయటకు పంపి గేటుకు తాళం వేసినప్పటికీ వారిని అదుపు చేయడం భద్రతా సిబ్బంది వల్ల కాలేదు. చివరికి చేసేదేమీ లేక వారాహి వాహనంతో సెల్ఫీలు దిగేందుకు ఒకరి తర్వాత ఒకరిని అనుమతించారు.

Janasena Pawan: వాలంటీర్లకు షాక్​.. పవన్‌ కల్యాణ్‌పై ఫిర్యాదును వాపసు చేసిన న్యాయస్థానం

Police Restrictions to Pawan Tour: విశాఖలో మూడో విడత వారాహి విజయ యాత్రలో పాల్గొనేందుకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ విశాఖ చేరుకున్నారు. పవన్ కల్యాణ్(Pawan Kalyan) వెంట నాదెండ్ల మనోహర్ ఉన్నారు. వారాహి యాత్రకు అడుగు అడుగునా పోలీసులు ఆంక్షలు విధించారు. మధ్యాహ్నం 12గంటలకు విశాఖ విమానాశ్రయానికి చేరుకున్న పవన్ కల్యాణ్​కి స్వాగతం పలికేందుకు కేవలం లోపలికి ఇద్దరికి మాత్రమే అనుమతినిచ్చారు. ఎయిర్ పోర్టు ఆవరణలో ర్యాలీలకు అనుమతి నిరాకరించారు. దీంతో పెద్ద ఎత్తున తరలి వచ్చిన అభిమానులకు నిరాశ ఎదురైంది. జాతీయ రహదారిపై నుంచి వెళ్లేందుకు జనసేన నేతలు రూట్ మ్యాప్ సిద్ధం చేయగా.. మధ్యాహ్న సమయంలో సిటీలో ట్రాఫిక్ సమస్య ఎక్కువగా ఉంటుందంటూ పవన్ వెళ్లే రూట్ లో పోలీసులు మార్పులు చేశారు.

ఎయిర్ పోర్టు నుంచి షీలా నగర్ మీదుగా కాన్వెంట్ జంక్షన్ నుంచి పూర్ణమార్కెట్, డాల్ఫిన్ హోటల్ మీదుగా వెళ్లాలని పోలీసుల షరతులు విధించి అదే రూటులో తీసుకెళ్లారు. జనసేన నాయకులు ఎయిర్ పోర్ట్ నుంచి ఎన్ఏడీ కొత్త రోడ్ తాటిచెట్ల పాలెం న్యూ కాలనీ మీదుగా సిటీలోకి వెళ్లడానికి అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేసినప్పటికీ ఫలితం లేకపోయింది. పవన్ కల్యాణ్​ ను ఎవ్వరు చూడకూడదని లూప్ లైన్ రూట్ లో పోలీసులు పవన్ బస చేసే హోటల్ వరకు తీసుకువెళ్లారు. మాజీ మంత్రి పడాల అరుణ కుటుంబ సమేతంగా జనసేన పార్టీలో చేరగా.. పవన్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఉత్తరాంధ్ర నుంచి బలమైన నాయకురాలు రావడం పార్టీని మరింత బలోపేతం చేసిందన్నారు.

తాడేపల్లిగూడెంలో వారాహి విజయ యాత్ర.. పవన్​కు ఘన స్వాగతం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.